ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది – హరినాథ్‌ పొలిచెర్ల

Published on Jun 25, 2019 9:00 pm IST

‘చంద్రహాస్‌’ వంటి విభిన్న కథా చిత్రంతో నటుడుగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డా. హరినాథ్‌ పొలిచెర్ల. రీసెంట్‌గా డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌ పై డా. హరినాథ్‌ పొలిచెర్ల ఒక పవర్‌ఫుల్‌ ఆర్మీ ఆఫీసర్‌గా టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్‌ రాణాప్రతాప్‌’. ‘ఎ జవాన్‌ స్టోరి’ అనేది క్యాప్షన్‌. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌కి, ఆడియో విడుదల చేసారు. కాగా జూన్‌ 28 అత్యంత గ్రాండ్‌గా సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు, నిర్మాత డా. హరినాథ్‌ పొలిచెర్ల మీడియాతో మాట్లాడారు.

ఈ సినిమాలో ఆయన తన పాత్ర గురించి చెప్తూ.. ‘సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు ‘కెప్టెన్‌ రాణా ప్రతాప్‌’. ఒక మిలటరీ ఆఫీసర్‌. ఒకసారి అనుకోకుండా పాకిస్థాన్‌ కి వెళ్లడం జరుగుతుంది. ఇండియన్‌ మిలటరీ ఆఫీసర్‌ పాకిస్థాన్‌ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి ఏం చేసాడు.. అన్నదే కథ అన్నారు.

ఇంకా సినిమా విడుదల గురించి మాట్లాడుతూ… ‘మా సినిమా విడుదలకి మైత్రి మూవీ మేకర్స్‌ సహాయం చేస్తున్నారు. నవీన్‌ ఎర్నేనిగారు నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. మాకు ఇరవై ఏళ్ళ పరిచయం ఉంది. మంచి సినిమా మీ హెల్ప్‌ కావాలి.. అనగానే ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. డెఫినెట్‌గా అన్ని చోట్ల మంచి థియేటర్స్‌ వస్తున్నాయి. జూన్‌ 28 గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దేశభక్తి, ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ లాంటి మంచి అంశాలతో తెరకెక్కింది. తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More