హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది ఒడిస్సీ’ భారత్‌లో బాక్సాఫీస్ వద్ద వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. 7వ రోజు రూ. 6.15 కోట్ల నెట్ సాధించడంతో, దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 90.30 కోట్లకు, గ్రాస్ వసూళ్లు రూ. 107.72 కోట్లకు చేరాయి.
నోలన్ కెరీర్‌లో భారత్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రంగా నిలవడమే కాకుండా ‘టెనెట్’, ‘ఓపెన్‌హైమర్’, ‘ఇంటర్‌స్టెల్లార్’ కలెక్షన్లను వెనక్కి నెట్టి భారత్‌లో ఆయనకు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 332 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం, రాబోయే వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
