న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. నాని, కయాదు లోహార్‌లపై చిత్రీకరించిన చివరి పాటతో టాకీ పార్ట్ సహా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. వచ్చే వారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.
నాని త్వరలోనే ప్రమోషన్ల హడావుడి ప్రారంభించనున్నాడు. ముఖ్యంగా USA అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


