న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ టీజర్ తాజాగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. నాని ఊరమాస్ లుక్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే టీజర్‌లోని కొన్ని డైలాగులు స్పష్టంగా వినబడలేదని, డబ్బింగ్ క్వాలిటీ సరిగా లేదని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఈ కామెంట్స్ కి చెక్ పెడుతూ, మేకర్స్ వినూత్నంగా డైలాగ్ పోస్టర్లను విడుదల చేయడం ప్రారంభించారు. దీంతో టీజర్‌పై చర్చ మరింత ముదిరి, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


