‘ది ప్యారడైజ్’ మ్యానియా.. ఫాస్టెస్ట్ రికార్డులతో మోత!

‘ది ప్యారడైజ్’ మ్యానియా.. ఫాస్టెస్ట్ రికార్డులతో మోత!

Published on Sep 10, 2026 9:05 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి స్టేజిలో ఉంది. అయితే ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ యూఎస్ మార్కెట్ లో రిలీజ్ కి ముందు ఓపెన్ చేసిన ప్రీమియర్స్ ప్రీ సేల్స్ బుకింగ్స్ తో నాని మోత మోగిస్తున్నాడు.

దీనితో ది ప్యారడైజ్ అప్పుడే లక్ష 50 వేల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మార్క్ పలు భారీ పాన్ ఇండియా సినిమాలని మించి అన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ లక్ష డాలర్స్ మార్క్ ని అత్యంత వేగంగా క్రాస్ చేసి రికార్డు సెట్ చేయగా ఇప్పుడు మరో మార్క్ కూడా ఇతర పాన్ ఇండియా సినిమాల కంటే ఫాస్ట్ గా అందుకొని ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో సంచలన ఓపెనింగ్స్ పై కన్నేసింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు