The Raja Saab: ‘సలార్’ లో ఛాన్స్ మిస్ చేసుకున్న ‘రాజా సాబ్’ బ్యూటీ ఎవరంటే!

The Raja Saab: ‘సలార్’ లో ఛాన్స్ మిస్ చేసుకున్న ‘రాజా సాబ్’ బ్యూటీ ఎవరంటే!

Published on Jan 2, 2026 9:00 AM IST

The Raja Saab

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో సాలిడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ముగ్గురు బ్యూటీస్ రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ అలాగే హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ సరసన నటిస్తున్నారు. అయితే వీరిలో రిద్ధి కుమార్ తప్ప మిగతా ఇద్దరు హీరోయిన్స్ కూడా ప్రభాస్ సరసన మొదటిసారి స్క్రీన్ చేసుకుంటున్నారు. కానీ వారిద్దరిలో ఓ హీరోయిన్ ప్రభాస్ తో ముందే హీరోయిన్ గా నటించాల్సి ఉందట.

అది కూడా ప్రభాస్ మాస్ యాక్షన్ చిత్రం “సలార్” సినిమాలో అట. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ అట. మాళవిక నటించిన మాస్టర్ సినిమా చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కోసం ఆఫర్ చేసారని ఆమె తెలిపింది. కానీ పలు కారణాలు రీత్యా ఆమె అందులో నటించడం కుదరలేదట. సో అప్పుడే ఈ బబ్యూటీ ప్రభాస్ సరసన నటించాల్సి ఉందట. కానీ ఫైనల్ గా ఒక గ్లామరస్ రోల్ తో రాజా సాబ్ (The Raja Saab) లో మంచి రోల్ ఆమె దక్కించుకుంది.

తాజా వార్తలు