పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ సినిమాలోని హారర్, కామెడీ మరియు యాక్షన్ అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రభాస్ వింటేజ్ లుక్ మరియు మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
కాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను 3 గంటల 3 నిమిషాలుగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో భారీ చిత్రాలన్నీ సుదీర్ఘమైన నిడివితో వస్తున్న ట్రెండ్‌నే ఈ చిత్రం కూడా అనుసరిస్తోంది. కథలో ఉన్న వేరియేషన్స్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కారణంగా సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మారుతి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
