పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐతే, ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. కాగా ట్రైలర్ విడుదలపై అప్‌డేట్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పెరుగుతున్న ఈ సందడి మధ్య, ట్రైలర్ పూర్తిగా సిద్ధమైన తర్వాతే విడుదల చేస్తాం అని టీమ్ క్లారిటీ ఇచ్చింది.
కాగా ఖచ్చితమైన విడుదల తేదీ మరియు సమయం తమ అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మాత్రమే ప్రకటిస్తామని చిత్ర బృందం హామీ ఇచ్చింది. మొత్తానికి అభిమానులు ఈ సినిమా ట్రైలర్ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.


