టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, ఓటీటీలో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ’ 2026 ఫస్ట్ హాఫ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారతదేశంలో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా ‘ది రాజా సాబ్’ అగ్రస్థానంలో నిలిచింది. థియేట్రికల్ రన్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, డిజిటల్ ప్లాట్ఫామ్లో మాత్రం ప్రభాస్ క్రేజ్ వల్ల భారీ వ్యూస్‌తో దూసుకుపోయింది.
ఈ ఓర్మాక్స్ టాప్ 10 జాబితాలో మలయాళ చిత్రాలు నాలుగు స్థానాలను దక్కించుకుని ఓటీటీలో తమ హవాను చాటాయి. ఇక తెలుగు చిత్రాల విషయానికి వస్తే ‘ది రాజా సాబ్’తో పాటు ‘అగ్లీ స్టోరీ’, ‘అఖండ 2’, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రాలు టాప్ 10లో చోటు సంపాదించుకున్నాయి. తమిళం నుండి ‘బ్లాస్ట్’, ‘యూత్’ సినిమాలు ఈ లిస్ట్‌లో నిలిచాయి. ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ భారీ వ్యూస్‌తో నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్లో వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా, డిజిటల్‌గా లభించిన ఈ అద్భుతమైన రెస్పాన్స్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాతో పాటు ఓటీటీలో ఆయనకున్న అన్మ్యాచ్డ్ రీచ్‌ను మరోసారి నిరూపించింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అయిన ఈ చిత్రం ఏకంగా 17.5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
