అందుకే విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉంటున్నాడట.

Published on Jun 23, 2019 5:52 pm IST

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన “దొరసాని” చిత్రం,ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూనే మరో ప్రక్క ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. విడుదలైన టీజర్ తో పాటు లిరికల్ సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
జూన్ 12న విడుదల కానున్న ఈ మూవీ గురించి ఇంత వరకు విజయ్ దేవరకొండ స్పందించకపోవడంతో ఇప్పడు చర్చనీయాంశమైంది.

తమ్ముడు నటించిన “దొరసాని” మూవీ టీజర్ గురించి కానీ సాంగ్స్ గురించి కానీ విజయ్ఇంత వరకు ఎటువంటి కామెంట్ చేయలేదు. ఐతే దీనివెనుక అసలు కారణం ఏమిటని ఆరా తీయగా,విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎవరి సహాయం లేకుండా సొంతగా ఎదగాలనుకుంటున్నాడట. కేవలం తన టాలెంట్తో తనని తానూ నిరూపించుకోవాలని భావిస్తున్నాడట. అందుకే తన తమ్ముడు నటించిన “దొరసాని” మూవీ కొరకు ఏవిధమైన ప్రమోషనల్ కామెంట్ చేయడంలేదంట విజయ్.

సంబంధిత సమాచారం :

X
More