నేను బతికి ఉండటానికి కారణం తనే – రేణు దేశాయ్

Published on Apr 17, 2019 4:05 pm IST

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తాజాగా ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాంకు అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అలీ అడిగిన ప్రశ్నలకు రేణు దేశాయ్ పలు ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు. అలీ, రేణు దేశాయ్ తో ఆద్య గురించి చెప్పమనప్పుడు తను నా జీవితం. నేను అసలు బతికి ఉండటానికి కారణమే తను. ఆద్య లేకపోతే, నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. అకీరా కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు.

కానీ ఒక ఆడపిల్ల చూపే ప్రేమ వేరుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూతురి ప్రేమను ఆస్వాదించాలి’ అని రేణు తెలిపారు. అలాగే ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘రేణు’ అనే పేరు ఇష్టం లేదంట కదా నిజమేనా..? అని అడగగా.. రేణు సమాధానమిస్తూ.. ‘నిజమే.. నా పేరు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. రేణు ఏంటి ఛీ.. అదేదో రేవతినో లేదా రేవనో అని పెడితే బావుండేది కదా’ అని తెలిపింది.

సంబంధిత సమాచారం :