​‘ది రెడ్ బ్యాగ్’ నుంచి రాధ్య లుక్ విడుదల

​‘ది రెడ్ బ్యాగ్’ నుంచి రాధ్య లుక్ విడుదల

Published on May 29, 2026 8:00 AM IST

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ రాధ్యకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న రాధ్య లుక్ ఈ పోస్టర్‌లో ప్రధానంగా కనిపిస్తోంది. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంతకుముందు ఇదే సినిమా నుంచి రాశి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

​కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతం అందిస్తుండగా, ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రాఫర్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు