విడుదల తేదీ : ఆగస్టు 21, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాధ్య, రాశి, కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, అవినాష్ బాదల్, ఆకాంక్ష తివారి తదితరులు
దర్శకత్వం : రవి కుమార్ సీరపు
సంగీతం : శేఖర్ మోపూరి
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
ఛాయాగ్రహణం : ప్రియేష్ గురుస్వామి
కూర్పు : శివ శర్వాణి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో నలుగురు అమ్మాయిలు లీడ్ రోల్స్ ప్లే చేసిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. టీజర్, ట్రైలర్లతో ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
అరిజోనాలోని ఓ క్లబ్‌లో మైక్ (కబీర్ సింగ్) ఒక క్రూరమైన, అక్రమ దందాలు చేసే నెట్‌వర్క్ నిర్వాహకుడిగా ఉంటాడు. అమాయకపు అమ్మాయిలను తన చీకటి సామ్రాజ్యంలోకి లాగుతుంటాడు. ఈ క్రమంలో విన్ని (రాధ్య)తో పాటు ఇండియా నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు మైక్ వద్ద చిక్కుకుంటారు. వీరి చేతికి ఒక మిస్టరీ ‘రెడ్ బ్యాగ్’ చిక్కుతుంది. అసలు ఈ అమ్మాయిలు ఇండియా వదిలి అరిజోనా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు ఆ బ్యాగ్‌లో ఏముంది? మైక్ నుంచి ఆ అమ్మాయిలు ఎలా తప్పించుకున్నారు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్య పాత్రలో నటించిన రాధ్య తన ఎమోషనల్ సీన్స్‌లో చాలా చక్కగా నటించింది. మిగతా ముగ్గురు భామలు కూడా గ్లామర్ పరంగానే కాకుండా, కీలక సన్నివేశాల్లో మెప్పించారు. ఎమోషనల్ సీన్స్‌లో ఈ నలుగురు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో కబీర్ సింగ్ ఆకట్టుకున్నాడు.
అమెరికా విజువల్స్, శేఖర్ మోపూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఒకట్రెండు సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్‌ను ఈ హీరోయిన్లు బాగానే చేశారు. ముఖ్యంగా విలన్ గ్యాంగ్‌తో వారు చేసే ఫైట్ సీన్ బాగుంది.
ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ వేగంగా సాగడం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. ఛేజింగ్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్‌తో సెకండాఫ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ప్రసాద్ బెహరా చేసిన కామెడీ కూడా అక్కడక్కడా నవ్విస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రానికి ఎంచుకున్న కథ రోటీన్ అనే చెప్పాలి. కథనంలో కూడా మేకర్స్ తడబడ్డారు. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. సాగదీత సీన్స్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. మరికొన్ని చోట్ల గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే లోపించడం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ కావడం కూడా మైనస్.
హీరోయిన్లు చెప్పే డైలాగ్స్‌కు వారి లిప్ సింక్ కాకపోవడంతో ఏదో డబ్బింగ్ చిత్రం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఛేజింగ్ సీక్వెన్స్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంప్రెస్ చేయదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు రవి కుమార్ ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా, కథనంలో ఇంకొంచెం పట్టు సాధించి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. అరిజోనా విజువల్స్ మరియు పబ్ వాతావరణాన్ని కెమెరామెన్ బాగా క్యాప్చర్ చేశాడు. బీజీఎం వర్క్ థ్రిల్లర్ సీన్స్‌ను ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా బెటర్ అవుట్‌పుట్ రావాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
మొత్తంగా చూస్తే.. ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఎమోషనల్ డ్రామాగా కొంతవరకే మెప్పిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, దర్శకుడు చెప్పాలనుకున్న సోషల్ మెసేజ్ ఈ చిత్రానికి ప్లస్. సాగదీసిన ఫస్ట్ హాఫ్, రొటీన్ కథనం ప్రేక్షకులను ఆకట్టుకోవు. సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం కొంతవరకే కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


