‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?

‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?

Published on Aug 10, 2026 10:03 AM IST

Varanasi

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సహజంగా రాముడు పాత్ర ఉంటే.. హనుమంతుడి పాత్ర కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ?, ‘హనుమంతుడి’గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ వార్తలో వాస్తవం ఉందా ?, మరి చూడాలి ఏది నిజమో.

కాగా ‘వారణాసి’ క్లైమాక్స్‌ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

తాజా వార్తలు