సన్నీలియోన్ బయోపిక్ లోంచి రెండో సీజన్ రాబోతుంది !

సన్నీలియోన్ బయోపిక్ లోంచి రెండో సీజన్ రాబోతుంది !

Published on Aug 21, 2018 1:49 AM IST

బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్నీ లియోన్. అడల్ట్ స్టార్ గా సన్నీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా ‘కరెన్జిత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా జులై రెండవ వారంలో Z5 ప్రసారం అయి మంచి పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకున్న సన్నీ బయోపిక్ మొదటి సీజన్ విజయవంతమైంది.

కాగా రెండవ సీజన్ త్వరలోనే రాబోతుంది. సన్నీ లియోన్ కెనడాలోని ఒక సాంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టి.. ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ స్టార్ గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నటిగా మారింది. అయితే సన్నీ బయోపిక్ సిరీస్ లో ఆమె గురించి మొత్తం మోడలింగ్, ఫోటో షూట్లు, సన్నీ చేస్తున్న పనులు నచ్చని ఆమె తల్లిదండ్రులను, సన్నీ ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఒడిదుడుకులను ప్రస్తావించబోతున్నారు. ఆదిత్య దత్ దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముందుకు తీసుకురాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు