నాగ్ క్రేజీ సీక్వెల్ లో సీనియర్ హీరోయిన్ ?

నాగ్ క్రేజీ సీక్వెల్ లో సీనియర్ హీరోయిన్ ?

Published on Jun 21, 2021 6:37 PM IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ పై ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. ఈ స్క్రిప్ట్ లో మరో హీరోయిన్ కూడా నటిస్తోందట. సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారని, ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకం అని తెలుస్తోంది. ఇక జులై నుండి షూటింగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే మొదట చైతు – నాగ్ కలయికలో ఈ సినిమా రానుందని వార్తలు వచ్చాయి. కానీ చైతు ఈ సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడట.

చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తాడని, అంటే ఈ సినిమా మొత్తం ‘బంగార్రాజు’ అతని మనవడు అఖిల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. అంటే నాగ్ – అఖిల్ కలయికలో తాత మనవళ్లుగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు