అఖిల్ 3 కోసం టైటిల్ ను రిజిస్టర్ చేయించారట !

Published on Aug 11, 2018 3:54 pm IST

‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్ర షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతుంది. తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మరి కొద్దీ రోజుల్లో అక్కడ షూటింగ్ ను ముగించుకొని ఇండియా తిరిగిరానుంది చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రానికి ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు గతం లోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఈచిత్రం కోసం అదే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు .

సంబంధిత సమాచారం :

X
More