ట్రైలర్ తో అంచనాలను పెంచుతున్న ‘దొరసాని’ !

ట్రైలర్ తో అంచనాలను పెంచుతున్న ‘దొరసాని’ !

Published on Jul 1, 2019 10:00 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దొరసాని’. కాగా తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘రేపే నీ విడుదల కదా…’ అన్న డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ప్రధానంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను హైలెట్ చేస్తూ ఎమోషనల్ గా సాగింది. ముఖ్యంగా ట్రైలర్ లో ‘ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే..’ అంటే, బదులుగా ఆనంద్ దేవరకొండ ‘మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని పలికిన డైలాగ్.. అలాగే ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి.

అదేవిధంగా, చిన్న దొరసానిగా శివాత్మిక తన లుక్స్ అండ్ ఫెర్పామెన్స్ తో ఆకట్టుకోగా.. ఆనంద్ దేవరకొండ కూడా తన పాత్రకి తగ్గట్లు చాల సహజంగా నటించాడు. మొత్తానికి థియేట్రికల్ ట్రైలర్ జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై బాగానే అంచనాలు పెంచింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

థియేట్రికల్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు