థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘భీమా’ ట్రైలర్

థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘భీమా’ ట్రైలర్

Published on Feb 24, 2024 4:17 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. ఈ మూవీని ఏ హర్ష తెరకెక్కిస్తుండగా ప్రియాభవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. నేడు ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని హైదరాబాద్ లోని ఏ ఏ ఏ సినిమాస్ లో జరిగిన ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసారు.

ఇక ఈ ట్రైలర్ లో గోపీచంద్ పవర్ఫుల్ లుక్స్, స్టైల్ తో పాటు డైలాగ్స్, మాస్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్ని కూడా ఎంతో బాగున్నాయి. మొత్తంగా భీమా ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు