‘టీజర్‌’తోనే సూపర్ స్టార్ ‘వైఎస్సార్‌’ని గుర్తుకు తెచ్చారు !

Published on Jul 8, 2018 10:28 am IST

దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవిత చరిత్ర ఆధారంగా మలయాళ సూపర్ స్టార్ ‘వైఎస్సార్‌’ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యాత్ర’. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. టీజర్‌ ‘యాత్ర’ చిత్రం ఫై అంచలనాలను పెంచేలా ఉంది .

వైఎస్సార్‌ వాయిస్ ఓవర్ వస్తుండగా టీజర్‌ మొదలవుతుంది. తెలుసుకోవాలనుంది.. వినాలనుంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది . వాళ్లతో కలిసి నడవాలనుంది.. అంటూ వాయిస్ ఓవర్లో వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. పంచెకట్టులో సూపర్ స్టార్ మమ్ముట్టి ‘వైఎస్సార్‌’ గుర్తు చేశారు. జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :