యూట్యూబ్ లో కనిపించని ఆ చిత్రం యొక్క ట్రైలర్ !

Published on Jan 2, 2019 12:54 pm IST

బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ యూట్యూబ్ లో కనిపించడంలేదు. మొన్నటి వరకు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగిన ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తే కనీసం 50వ స్థానంలో కూడా లేకపోవడంతో ఈ పరిణామం ఫై అనుపమ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మన్మోహన్ సింగ్ ప్రధాని గా వున్నప్పుడు ఆయన దగ్గర భద్రత సలహాదారుడిగా పని చేసిన సంజయ్ బారు రాసిన మన్మోహన్ బయోపిక్ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ట్రైలర్ విడుదలైయ్యాక ఈ చిత్రం ఫై కాంగ్రెస్ పార్టీ అభ్యతరం వ్యక్తం చేసింది. విజయ్ రత్నాకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More