థియేటర్ల ఓపెన్ పై ప్రభుత్వం జీవో !

థియేటర్ల ఓపెన్ పై ప్రభుత్వం జీవో !

Published on Nov 23, 2020 6:20 PM IST

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి సినిమా హాళ్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు స్క్రీన్స్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను విడుదల చేస్తూ జీవోని రిలీజ్ చేసింది.
50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్ ను ప్రారంభించాలి. అలాగే ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలి. సానిటైజార్ ఉంచాలి. భౌతిక దూరం ,గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం. ప్రతి షో ముందు కామన్ ఏరియా లో.సానిటీజేషన్ చేయాలి.

అలాగే టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్ మధ్య ఉంచాలి. హ్యూమినీటిని 40 నుంచి 70 శాతం మధ్య మెంటెన్ చేయాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు ఓపెన్ అయిన వెంటనే ఏ చిత్రాలను ప్రదర్శించనున్నారు అనే విషయమై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీల ద్వారా కొన్ని మంచి సినిమాలు బయటికొచ్చాయి. వాటితోనే సినిమా హాళ్లు రీఓపెన్ అవుతాయనే టాక్ ఉంది. ఓటీటీల్లో ఆశించిన ఫలితం రాబట్టుకోలేకపోయిన సినిమాలను ఆయా చిత్రాల నిర్మాతలు థియేటర్లు ఓపెన్ కాగానే రీరిలీజ్ చేస్తారనే టాక్ కూడ ఉంది. అయితే దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మాత్రం ఒకసారి ఓటీటీల ద్వారా బయటికొచ్చిన చిత్రాలను మళ్ళీ ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి థియేటర్లకు జనం ఎలా వస్తారో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు