30 న తెలంగాణ లో థియేటర్స్ బంద్

30 న తెలంగాణ లో థియేటర్స్ బంద్

Published on Apr 30, 2014 2:01 AM IST

Election-Commission-of-Indi
తెలంగాణ ప్రాంతంలో 30 వ తేదీన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 30 వ తేదీన పబ్లిక్ హాలిడే గా ప్రకటించారు. ఇదే కారణం తో ఐటీ కంపెనీలతో సహా, దాదాపు అన్ని ప్రైవేటు కంపెనీలు కూడా హాలిడే గా ప్రకటించారు.

ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలనుగునంగా తెలంగాణ ప్రాంతంలో 30 వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మల్టీప్లెక్స్ సహా సింగల్ స్క్రీన్ థియేటర్స్ కూడా బంద్ చేయనున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవలసింది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ ప్రజలను కోరుతున్నారు.

బెంగుళూరు, ముంబై వంటి మెట్రో నగరాలలో తక్కువ ఓటు శాతం నమోదయ్యింది. మరి హైదరాబాద్ లో అయిన ఓటు శాతం మెరుగుగా ఉంటుందా అన్నది వేచిచూడాలి.

తాజా వార్తలు