పాత కాలపు తెలుగు చిత్రాలలో విజయం సాదించిన పాటలను రీమిక్స్ చెయ్యటం ఈ మధ్య నడుస్తున్న ట్రెండ్. ఇటీవల “రచ్చ” చిత్రంలో “వాన వాన వెల్లువాయే” పాటతో పాటు చాలా ఉదాహరణలు ఉన్నాయి. “ఎ శ్యాం గోపాల్ వర్మ ఫిలిం” సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నీలిమ తిరుమల శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో “తీస్కో కోకో కోలా” పాటను రీమిక్స్ చేయ్యనున్నారని ప్రకటించారు. 1971లో రామకృష్ణ మరియు విజయలలిత ప్రధాన పాత్రలలో వచ్చిన “రౌడీలకు రౌడీలు” చిత్రంలోనిది ఈ పాట. సత్యం కంపోజిషన్ లో ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ఈ పాట ఇప్పటికీ ఒక సంచలనమే. ఈ పాట రీమిక్స్ విషయాన్నీ ధృవీకరిస్తూ నీలిమ ట్విట్టర్ లో ఇలా అన్నారు ” ఏ శ్యాం గోపాల్ వర్మ చిత్రంలో ఎల్ ఆర్ ఈశ్వరి పాడిన ప్రముఖ పాట ఏస్కో కోకో కోలా పాటను రీమిక్స్ చెయ్యబోతున్నాం” అని అన్నారు. మంత్ర ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా రాకేశ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తునారు ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే మొదలు కానుంది.
తిరిగి తెర మీదకి రానున్న “తీస్కో కోకో కోలా” పాట
తిరిగి తెర మీదకి రానున్న “తీస్కో కోకో కోలా” పాట
Published on May 19, 2012 1:17 PM IST
సంబంధిత సమాచారం
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కి త్రివిక్రమ్ స్టాంప్.. హిట్ గ్యారెంటీ!
- “ఇరుముడి” ట్రైలర్ పైనే అందరి కళ్ళు!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య
- మరో ట్రాన్స్ఫార్మేషన్లోకి రామ్ చరణ్..?
- ప్రభాస్తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
- చిరు లీక్స్.. ‘మెగా 158’ టైటిల్ ఇదేనా..?
- మ్యాడ్ హిట్ ‘డిసి’ కాంబినేషన్ మళ్ళీ..?
- ఇంటర్వ్యూ : దర్శకుడు ఎం.ఎస్.రాజు – ‘అగధ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!
- చిరు బర్త్ డే ట్రీట్.. మెగా 158 టీజర్ అదిరిపోతుందట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


