బిగ్ బాస్ విన్నర్ రాహుల్ అయినా..,రెమ్యూనరేషన్ లో వారే టాప్

Published on Nov 5, 2019 10:34 pm IST

గత ఆదివారం అత్యంత ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ సీజన్ 3ముగిసింది. అనూహ్యంగా అనేక మార్లు నామినేట్ కాబడి షో నుండి వెళ్ళిపోతాడనుకున్న రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఫైనల్ కి చేరిన రాహుల్, శ్రీముఖిలలో ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా విన్నర్ గా రాహుల్ ని ఎంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 50లక్షల నగదు బహుమతితో పాటు, బిగ్ బాస్ టైటిల్ మరియు ఇతర బహుమతులను రాహుల్ గెలుపొందారు. ఐతే అసలు విషయం ఏమిటంటే విన్నర్ గా రాహుల్ గెలుచుకున్న ప్రైజ్ మనీ కంటే కూడా కొందరు కంటెస్టెంట్స్ కు హౌస్ లో కొనసాగడం వలన అందిన మొత్తమే ఎక్కువ అని వినికిడి.

ఫైనల్ చేరిన శ్రీముఖి, వరుణ్ వంటి కంటెస్టెంట్స్ కి ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కోటి రూపాయలకు పైనే వారికి నిర్వాహకులు చెల్లించారట. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న యాంకర్ శ్రీముఖి తన ప్రోగ్రామ్స్ షెడ్యూల్స్ అన్ని వదిలి మూడు నెలలలు ఈ షోకి టైం కేటాయించాలంటే ఆమె ముందుగానే నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక మరో సెలెబ్రటీ కంటెస్టెంట్ హీరో వరుణ్ కూడా దాదాపు కోటి రూపాయల పారితోషికం అందుకున్నారట. కాబట్టి బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ గెలుచుకున్నదాని కంటే రెండు రెట్లు అదికంగా వీరు అందుకున్నారట.

సంబంధిత సమాచారం :