ఘనంగా ‘తెరచాప’ చిత్ర ట్రైలర్ విడుదల

Therachapa

అనన్య క్రియేషన్స్ పతాకంపై కైలాష్ దుర్గం నిర్మాణంలో, జోయల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

సముద్రతీరంలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఆహ్లాదకరమైన నేపథ్య సంగీతంతో మొదలై, గ్రామీణ వాతావరణంలోని ప్రేమ, ఆప్యాయతలతో పాటు స్థానిక రాజకీయాలు, భేదభావాలను ఇందులో సహజంగా చూపించారు. తన ఊరిలోని పరిస్థితులపై పోరాడే ఒక యువకుడి కథే ఈ చిత్ర ఇతివృత్తంగా తెలుస్తోంది. డైలాగ్స్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ నటులు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతం సమకూర్చారు. టాలీవుడ్‌లో విలేజ్ పొలిటికల్ డ్రామాలకు ఒక బెంచ్ మార్క్‌లా నిలిచేలా ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

Exit mobile version