చైతు ‘లవ్ స్టోరీ’కి మంచి డిమాండ్ ఉందట !

చైతు ‘లవ్ స్టోరీ’కి మంచి డిమాండ్ ఉందట !

Published on Jun 7, 2020 12:20 AM IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు
తెలుస్తోంది. ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి.

డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేసేలానే ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు