మోక్షజ్ఞకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది – బోయపాటి శ్రీను

మోక్షజ్ఞకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది – బోయపాటి శ్రీను

Published on Apr 25, 2014 8:51 AM IST

Boyapati-Srinu
నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను చేసిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి.అంతే కాకుండా ఆ రెండు సినిమాలు బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాలని చెప్పే బోయపాటి శ్రీను పుట్టిన రోజు ఈ రోజు.

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమాకి తనే దర్శకత్వం వహిస్తాడని వస్తున్నా వార్తలపై స్పందిస్తూ ‘మోక్షజ్ఞ సినిమాకి నేను దర్శకత్వం వహిస్తానని అంటున్నారు. అసలు మోక్షజ్ఞ పరిచయం కావడానికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి బాలకృష్ణ నిర్ణయం తీసుకుంటారని’ అన్నాడు.

బోయపాటి శ్రీను తదుపరి సినిమా రామ్ చరణ్ తో ఉంటుంది. ఈ సినిమా ‘భద్ర’, ‘ఒక్కడు’ తరహాలో నవతరాన్ని ఆకట్టుకునేలా ఉంటుందని అన్నాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బోయపాటి శ్రీనుకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

తాజా వార్తలు