అక్కడ “వకీల్ సాబ్”కు ఇంకా స్టార్ట్ కాలేదట.!

Published on Oct 29, 2020 7:02 am IST

చాలా కాలం విరామం అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించేందుకు ఒప్పుకున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. ఈ కోవిడ్ లేకపోతె ఎప్పుడో విడుదల అయ్యిపోవాల్సిన ఈ చిత్రంపై ఎన్నెన్నో ప్రిపరేషన్స్ పవన్ అభిమానులు చేసుకున్నారు. కానీ వాటన్నటికీ కరోనా బ్రేక్ వేసింది.

అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలించడంతో మిగిలిన కాస్త షూట్ కూడా కంప్లీట్ కానుంది. ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లోనే ఈ చిత్రానికి భారీ ఓటిటి ఆఫర్లు వచ్చాయి. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం అందుకు ససేమిరా అనడంతో దాదాపు థియేట్రికల్ రిలీజ్ కే ఫిక్స్ అయ్యింది. అయితే ఈ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ కు ఎలాగో హెల్డ్ లోనే ఉన్నారు.

మన రాష్ట్రాల్లో థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి ఢోకా లేదు కానీ ఈ చిత్రానికి మాత్రం ఓవర్సీస్ బిజినెస్ ఇంకా స్టార్ట్ కాలేదని తెలుస్తుంది. ఇంకా ఇప్పుడున్న భారీ చిత్రాల్లో విడుదలకు అతి సమీపంలో ఉన్న చిత్రమిదే అయినా ఇంకా దీని ఓవర్సీస్ బిజినెస్ పై ఎలాంటి సమాచారమూ లేదు ఉలుకూ లేదు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి, నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More