“సలార్”లో శృతికి ఇలాంటి సీన్స్ లేవా.?

Published on Mar 7, 2021 1:30 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”. ఇంతకు ముందు నీల్ తెరకెక్కించిన ఉగ్రం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్టుగా మేకర్స్ ఆ మధ్యనే కన్ఫర్మ్ చేశారు.

అయితే అప్పటి నుంచే ఇందులో ఆమె ఓ సాలిడ్ రోల్ లో చేస్తుంది అని తనపై కూడా అదిరే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా శృతి చెప్పిన దాని ప్రకారం తనపై ఎలాంటి యాక్షన్ సీకెన్స్ లు లేవని జస్ట్ తన యాక్టింగ్ పార్ట్ వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది.

శృతి తో ఒక సరైన యాక్షన్ పార్ట్ చేస్తే ఎలా ఉంటుందో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “క్రాక్” లో చూసారు. అలా ఇలాంటి భారీ యాక్షన్ సినిమాలో కూడా ఏమన్నా ఉండొచ్చేమో అని చాలా మంది ఆశించారు. కానీ అలాంటివి ఏమీ లేవని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :