“సర్కారు వారి పాట”పై అవన్నీ రూమర్లేనా.?

SarkaruVaariPaata
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. వరుస విజయ చిత్రాల హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు దుబాయ్ లో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే మరి ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ అంశం గట్టిగా వైరల్ అవుతుంది. అదే ఈ చిత్రం తాలుకా సాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల కోసం.

ఈ సినిమా తాలుకా ఈ హక్కుల రికార్డు స్థాయి ధరకు అప్పుడే అమ్ముడు పోయాయి అని అనేక రకాల ఊహాగానాలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇందులో డీప్ గా వెళ్లినట్టయతే ఇందులో ఎలాంటి నిజమూ లేదనే మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమా డిజిటల్ సాటిలైట్ హక్కులు పై ఎలాంటి చర్చ రాలేనట్టే తెలుస్తుంది.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ చిత్రంలో మహేష్ సరసన మొట్ట మొదటి సరిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version