తన సినిమాలతో గ్లోబల్ దర్శకునిగా మారిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “వారణాసి”. సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక డ్రీం కాంబినేషన్ గా వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోషన్స్ ఇపుడు జరుపుకుంటుంది. అయితే తాజాగా వారణాసి విషయంలో రాజమౌళి మెక్సికో ప్రజలకి ఇచ్చిన సందేశంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తన సినిమాల్లో కదిలించే ఎమోషన్స్, మనుషులకి అందించే అనుభూతిలే కీలకం అని అవి సరిగ్గా ఉంటే ఏ దేశం ప్రజల్లోకి అయినా సినిమా వెళ్లి తీరుతుంది అని తెలిపారు. ఇపుడు తాను చేస్తున్న వారణాసి సినిమాకి కూడా అవే ఫౌండేషన్ అని రాజమౌళి రివీల్ చేశారు. బలమైన ఎమోషన్స్ తో జక్కన్న స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీలోనే వారణాసి కూడా సిద్ధం చేస్తుండగా ఇది గ్లోబల్ ఆడియెన్స్ లో ఏ రేంజ్ లో రీచ్ అవుతుందో చూడాల్సిందే.
