‘వెంకీ మామ’లో అదే హైలెట్ అట

Published on Nov 9, 2019 2:00 am IST

నిన్న వెంకీ మామ చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్ విడుదల చేశారు. మామ వెంకీ పై చైతూ కి ఉన్న ప్రేమాభినాలను మరియు వారిద్దరి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ సాగిన ఆ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ టైటిల్ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ దక్కించుకొందని సమాచారం. కాగా వెంకీ మామ చిత్రంలో మామా అల్లుళ్ళ మధ్య నడిచే సరదా సన్నివేశాలతో పాటు, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయట. తల్లితండ్రులు లేని చైతూకి అన్నీ తానై పెంచిన మామ వెంకీకి మధ్య మనస్పర్థలు.., దానికి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ సీన్స్ బాగుంటాయని సమాచారం.

ఇక ఈ చిత్రంలో వెంకటేష్ పల్లెటూరి రైతు పాత్ర చేస్తుండగా, చైతు యంగ్ జవాన్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తుండగా పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More