ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..!

Published on Aug 31, 2021 3:00 am IST

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడడంతో మళ్ళీ సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో చిత్ర పరిశ్రమలో తిరిగి సందడి నెలకొంది. వారవారం అరడజన్‌కి పైగా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్‌కి సిద్దమయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేద్దాం.

* మేఘా ఆకాశ్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన “డియర్ మేఘ” సెప్టెంబర్ 3న విడుదల కాబోతుంది.

* అవసరాల శ్రీనివాస్, రుహానీశర్మ కాంబినేషన్‌లో రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్న “నూటొక్క జిల్లాల అందగాడు” సినిమా కూడా సెప్టెంబర్ 3న విడుదల కాబోతుంది.

* ఇక సుజన్, తనీష్క్ జంటగా జలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “అప్పుడు-ఇప్పుడు”. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 3న విడుదల అవుతుంది.

* ఇక కార్తీక్ సాయి, డాలీ షా, నేహా దేశ్ పాండే కీలక పాత్రల్లో చిన్నా దర్శకత్వం వహించిన “కిల్లర్”, రుషికా రాజ్, రాజ నరేంద్ర, కేశవ్ దీపకమ్, ఇందు కుసుమ తదితరులు కీలక పాత్రల్లో శేష్ కార్తికేయ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ “అశ్మీ” వంటి సినిమాలు కూడా సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.

సంబంధిత సమాచారం :