బాలయ్య సినిమా కోసం వీరే ముందు వరుసలో..!

Published on Mar 9, 2021 7:02 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం మాస్ అండ్ ఇప్పుడు హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ భారీ సినిమా పై ఎప్పటి నుంచో గట్టి అంచనాలు కూడా నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఇంకా టైటిల్ కూడా ఖరారు కానీ సినిమాకు ప్రస్తుతం శాటిలైట్ మరియు ఓటిటి డీల్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం స్టార్ సంస్థ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. శాటిలైట్ మరియు ఓటిటి హక్కుల విషయంలో స్టార్ సంస్థ వారే మిగతా సంస్థలతో పోలిస్తే ముందు ఉన్నారట. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా హక్కులు ఎవరు సొంతం చేసుకున్నారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :