“సర్కారు వారి పాట”లో ఈ సీన్స్ తీస్తున్నారా.?

Published on Jan 26, 2021 3:01 pm IST

లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” హ్యాష్ ట్యాగ్ తో సెన్సేషనల్ రికార్డు సెట్ చేసిన మహేష్ ఇప్పుడు దుబాయ్ లోని ఆ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. మరి అలాగే ఈ చిత్రానికి సంబంధించి షూట్ ను కూడా మొదలు పెట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన ఇవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఈ సినిమా షూట్ కు సంబంధించి వినిపిస్తుంది. మేకర్స్ మొదటగా చేస్తున్న షూట్ లో మహేష్ మరియు కీర్తి సురేష్ ల నడుమ రొమాంటిక్ ట్రాక్స్ ను తీస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మరి కొన్ని కీలక సన్నివేశాలను కూడా ఇదే షూట్ లో చేయనున్నట్టుగా వినికిడి.

మొత్తానికి మాత్రం భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మహేష్, మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :