“సర్కారు” లో ఇవి మాత్రం సూపర్ స్పెషల్ అట.!

Published on Aug 20, 2021 9:59 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ పై అంత స్థాయి హైప్ కూడా ఉంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మొన్న మహేష్ బర్త్ డే సందర్భంగా వచ్చిన మాస్ అండ్ స్టైలిష్ బ్లాస్టర్ కి కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసాము.

అయితే ఈ పెట్ల ఈ చిత్రాన్ని మహేష్ ఫ్యాన్స్ కోసం చాలా సూపర్ స్పెషల్ కేర్ ని మొదటి నుంచి తీసుకోనున్నాడని కంప్లీట్ గా వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చెయ్యడం కన్ఫర్మ్ అని మొదటి నుంచి ఉన్న మాట. మరి వీటిలోని యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మాత్రం పెట్ల మరింత కేరింగ్ గా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ని కూడా వింటేజ్ మోడ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇంటెన్స్ మహేష్ ని అదే యాటిట్యూడ్ లో పరశురామ్ పెట్ల ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గోవాలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ సీక్వెన్స్ కూడా ఆ తరహాలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం మహేష్ ఫ్యాన్స్ కావాల్సినంత ఫ్యాన్ స్టఫ్ ని దర్శకుడు పెడుతున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :