వాళ్లకు దమ్ము లేదు – రేణు దేశాయ్

వాళ్లకు దమ్ము లేదు – రేణు దేశాయ్

Published on Feb 12, 2015 9:16 PM IST

renu_desai
ప్రముఖ దర్శకురాలు, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ట్విట్టర్ లో ఆకతాయిలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కొంచం స్వరం పెంచిన రేణు దేశాయ్.. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు.

వాళ్లకు తమ ఒరిజినల్ పేర్లు, ఫోటోలు ట్విట్టర్లో పెట్టుకునే దమ్ము లేదు. పనికిరాని వాళ్ళు అందరూ ట్విట్టర్లో చేరి సెలబ్రిటీలను తిట్టడానికి, కామెంట్ చేయడానికి రెడీ అయిపోతారు. మొదట మీ నిజమైన పేర్లు, ఫోటోలు పెట్టడండి. ఆ తర్వాత మమ్మల్ని పేస్ చేయండి. నిజ జీవితంలో సెలబ్రిటీలకు 10 కిలోమీటర్ల దూరం వరకు రాలేని వీళ్ళకు.. ట్విట్టర్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో మాత్రం నోరు లేస్తుంది. అంటూ రేణు దేశాయ్ ఘాటుగా స్పందించింది.

రేణు దేశాయ్.. ట్విట్టర్లో ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. ఆమె సోషల్ మీడియాలో ఖాతా తెరచిన సమయం నుండి ఎందరో ఆకతాయిలు వేధిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు సందర్భాలలో గట్టిగానే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది.

తాజా వార్తలు