సింపుల్ గా తారక్, నీల్ ల సినిమా ఎలా ఉంటుందో చెప్తున్నారు!

Published on Jun 4, 2021 11:00 am IST

దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం” తర్వాత తారక్ నుంచి కూడా సూపర్బ్ లైనప్ ఉంది. మరి వాటిలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి కూడా భారీ పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చెయ్యడంతో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.

మరి ఈరోజు నీల్ బర్త్ డే కావడంతో తారక్ సహా ఈ కాంబోలో సినిమా ప్లాన్ చేసిన నిర్మాణ సంస్థలు కూడా వీరి చిత్రం ఎలా ఉంటుందో సింపుల్ గా చెప్పేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే తమ “మాస్”సివ్ జర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.

దీనిని బట్టి ఈ కాంబోలో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ గా ఉంటుందని అవుతుంది. అలాగే తారక్ విషెష్ తెలుపుతూ తాను కూడా తమ కాంబో ఫోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి చాలా ఎంతో ఎదురు చూస్తున్నానని తెలిపారు. మొత్తానికి మాత్రం ఈ కాంబోలో ఒక గట్టి సినిమానే రాబోతుంది అని అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :