‘తిక్క’ సినిమాకు 10 నిమిషాల కత్తెర..!

thikka
వరుస విజయాలతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, తాజాగా ‘తిక్క’ అనే సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్, మొదటిరోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కామెడీ అంటూ చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అదేవిధంగా కాస్త రన్‌టైమ్ ఎక్కువనే టాక్ కూడా వినిపించడంతో టీమ్ సినిమాను ఓ పది నిమిషాల పాటు కత్తిరించింది.

మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా రేపట్నుంచి పది నిమిషాల రన్‌టైమ్ తగ్గి ప్రదర్శితం కానుంది. ‘ఓం’ ఫేం సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రోహిణ్ రెడ్డి నిర్మించారు. సాయిధరమ్ తేజ్ సరసన మన్నారా చోప్రా, లారిస్సా బొనెసి హీరోయిన్లుగా నటించారు.