‘నీది నాదీ ఒకే కథ’ ఫేమ్ శ్రీ విష్ణు ప్రస్తుతం ‘తిప్పరా మీసం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు . నారారోహిత్ హీరో గా ‘అసుర’ చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణ విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈచిత్రంలో శ్రీ విష్ణు కు జోడిగా చెన్నై మోడల్ నిక్కీ తంబోలిని ఎంపిక చేశారు.
ఇక ఈ చిత్రం టైటిల్ తోనే మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ చిత్రం తో పాటు నారా రోహిత్, సుధీర్ బాబులతో కలిసి ‘వీరభోగ వసంతరాయులు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో ఆయన గ్రహాంతరవాసి గా కనిపించనున్నారని సమాచారం.


