నవరస నుండి థర్డ్ సింగిల్ విడుదల కి సిద్దం!

Published on Jul 14, 2021 1:31 pm IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న నవరస వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నవరస వెబ్ సిరీస్ కి సంబందించిన పోస్టర్లు, వీడియోలు కొన్ని విడుదల అయ్యాయి. అయితే ప్రతి ఒక్క పోస్టర్ ఈ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తి రేపేలా ఉన్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన మరొక క్రేజీ సాంగ్ విడుదల కి సిద్దం అవుతుంది.

అయితే విజయ్ సేతుపతి, రేవతి, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో బిజొయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఎపిసోడ్ ఎదిరి. ఎదిరి కరుణ రసం. అయితే ఈ ఎపిసొడ్ నుండి యాదో అంటూ నేడు సాయంత్రం విడుదల కి సిద్దం అయింది. అయితే దీనికి గోవింద్ వసంత సంగీత అందించారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది. అయితే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 6 న విడుదల కానుంది. తమిళం లో మాత్రమే కాకుండా తెలుగు తో పాటు పలు భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :