
ఇప్పటి వరకూ టాలీవుడ్ లో హీరో-డైరెక్టర్ లేదా హీరో-హీరోయిన్ కాంబినేషన్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్ తన కాంబినేషన్ ని వరుసగా సినిమాల్లో రిపీట్ చేసి సంచలనం సృస్తిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో కాదు మన సమంత మరియు ప్రణిత.
వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టించింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘రభస’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుంది. తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం సమంత – ప్రణిత హీరోయిన్స్ గా మరో సినిమాలో నటించనున్నారు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమా.
ఇప్పటికే సమంతని ఖరారు చేసిన త్రివిక్రమ్ తాజాగా ప్రణితని ఖరారు చేసాడని సమాచారం. వీరితో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని, ఆ భామ కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారని సమాచారం.