టాలీవుడ్లో ట్యాలెంటెడ్ నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తనదైన పర్ఫార్మె్న్స్తో తిరువీర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అయితే, ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని తాజాగా ప్రకటించాడు ఈ హీరో. ఈసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ‘ఓ.. సుకుమారి..!’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాను భరత్ దర్శన్ డైరెక్ట్ చేయనుండగా, మహేశ్వర రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.
