విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకుడు : ఎస్.పి. దుర్గా నగేష్
నిర్మాత : మిత్రవింద మూవీస్
సంగీతం : కె.ఎమ్. రాధాకృష్ణన్
ఛాయాగ్రహణం : విశ్వేశ్వర్ ఎస్ వీ
ఎడిటింగ్ : అన్వర్ అలీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
తన నటనతో మంచి మార్కులు అందుకున్న యువ నటుడు తిరువీర్ హీరోగా చేసిన సినిమాలతో కూడా వరుసగా మెప్పిస్తూ వస్తున్నాడు. ఇలా లేటెస్ట్ గా వచ్చిన తన కొత్త సినిమానే ‘పాపం ప్రతాప్’. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఆర్ధికంగా బాగానే సెటిల్డ్ అయ్యిన యువకుడు ప్రతాప్ (తిరువీర్) తన తండ్రి (అజయ్ ఘోష్) కి ఇష్టం లేకపోయినా తాను ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను వివాహం చేసుకుంటాడు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో, ప్రతాప్ నిద్రలో ఒక వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలుసుకున్న బుజ్జమ్మ తనని వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు ప్రతాప్ ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏమిటి? దానికి పరిష్కారం దొరికిందా? చివరకు ఈ జంట కలిసారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఒక నటుడుగా తిరువీర్ ఎలాంటి పెర్ఫామార్ అనేది తెలుగు ఆడియెన్స్ కి తెలుసు. ఎలాంటి రోల్ లో అయినా తాను ఇమడగలడు. అలానే ఇందులో అమాయకత్వం కలబోసిన ప్రతాప్ పాత్రలో తిరువీర్ మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో తన నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటాయి.
ఇక హీరో తండ్రిగా నటుడు అజయ్ ఘోష్ నటన సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచారు అని చెప్పొచ్చు. కొడుకుపై ఆయన చూపించే చిరాకు, ఫ్రస్ట్రేషన్ మంచి కామెడీని పండిస్తాయి. అలాగే ఫస్టాఫ్ లో తనపై కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.
వీటితో పాటుగా కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. అలానే ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో హీరో సమస్య ఏంటి అనేది స్టార్టింగ్ లో ఒకింత ఆసక్తి కలిగించినా, తర్వాత అది తెలిశాక హీరోయిన్ అంతకాలం ఆ విషయాన్ని ఎందుకు దాచిందో చెప్పే కారణం ఏమాత్రం కథనంలో అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఈ మధ్యలో డ్రామా అంతా సినిమాను సాగదీసినట్లు అనిపిస్తుంది.
అలాగే సెకండాఫ్ లో ఎమోషన్స్ మరియు డ్రామాపై దర్శకుడు దృష్టి పెట్టినప్పటికీ, అవేవీ వర్కవుట్ కాలేదు. మెయిన్ గా కథ ప్రధాన పాయింట్ లోనే లాజిక్ లోపంతో ఆడియెన్ అంత కనెక్ట్ కాలేడు.
ఇక హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ నటన బాగున్నా, ఆమె పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే అజయ్ ఘోష్ పాత్ర ప్రవర్తన కూడా సెకండ్ హాఫ్‌లో వింతగా అనిపిస్తుంది. అలానే హీరో ఆరోగ్య సమస్యను ఇంకాస్త డెప్త్ గా ప్రెజెంట్ చేసి ఉంటే కథనం బాగా వర్కౌట్ అయ్యి ఉండేది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా నీట్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ ని బాగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.
ఇక దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ విషయానికి వస్తే.. తాను ఒక ఇంట్రెస్టింగ్ లైన్ నే పట్టుకున్నారు. అలాగే దానికి అనుగుణంగా క్రియేట్ చేసుకున్న కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తాయి కానీ ఇదే స్టోరీ లైన్ కి తగ్గ డెప్త్, లాజిక్ ని మాత్రం తాను మిస్ అయ్యారు. వీటిని కూడా కరెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పాపం ప్రతాప్’ లో యువ నటుడు తిరువీర్, అజయ్ ఘోష్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్, కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కగా మంచి నవ్వు తెప్పిస్తాయి. కానీ కథనంలో డెప్త్, కొంచెం సీరియస్ నెస్ తక్కువ అయ్యింది. వీటితో ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించే సింపుల్ విలేజ్ డ్రామాలా మిగిలింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమా ట్రై చెయ్యండి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


