2025 సంవత్సరంలో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా?

2025 సంవత్సరంలో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా?

Published on Dec 27, 2025 7:00 AM IST

Allu-Arjun

2025 ఏడాది ముగింపుకు చేరుకుంటుండగా, ఈ ఏడాది డిజిటల్ ప్రపంచంలో టాలీవుడ్‌ను శాసించిన హీరోలెవరో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి స్థానంలో నిలిచి, ఆన్‌లైన్‌లో తన ప్రభావాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ‘పుష్ప-2: ది రూల్’ సినిమా సాధించిన సుమారు రూ.1800 కోట్ల భారీ వసూళ్లు, దాని చుట్టూ ఏర్పడిన హడావుడి కారణంగా బన్నీ ఏడాది పొడవునా వార్తల్లో నిలిచారు.

అంతేకాదు, అట్లీతో తెరకెక్కబోయే ‘AA22’, త్రివిక్రమ్‌తో చేయనున్న కొత్త ప్రాజెక్టులపై ఉన్న అంచనాలు కూడా నెటిజన్లను అల్లు అర్జున్ పేరు కోసం ఎక్కువగా సెర్చ్ చేయించేలా చేశాయి. ఈ లిస్ట్‌లో రెండో స్థానాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ కైవసం చేసుకున్నారు. ‘కల్కి 2’, ‘స్పిరిట్’ వంటి భారీ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రభాస్‌ను నిరంతరం ట్రెండింగ్‌లో ఉంచాయి.

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో స్థానంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. మొత్తంగా 2025లో టాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా, సెర్చ్ ఇంజిన్లలోనూ తమ హవాను స్పష్టంగా చూపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు