వెంకటేష్ నెక్స్ట్ మూవీలో మరో హీరోయిన్!

వెంకటేష్ నెక్స్ట్ మూవీలో మరో హీరోయిన్!

Published on Jul 2, 2024 5:32 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో SVC58 పేరుతో తెరకెక్కుతున్న కాప్ డ్రామా లో నటించనున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లు కథానాయికలుగా నటిస్తున్నారు.

ప్రీ లుక్ పోస్టర్ ప్రకారం, ఐశ్వర్య రాజేష్ ఎక్సలెంట్ భార్య పాత్రలో నటిస్తుండగా, మీనాక్షి మాజీ ప్రియురాలిగా కనిపించనుంది. రేపు ఉదయం 11:16 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు