“వీరమల్లు”లో ఈ అంశం మరో బిగ్గెస్ట్ హైలైట్.!

“వీరమల్లు”లో ఈ అంశం మరో బిగ్గెస్ట్ హైలైట్.!

Published on Mar 13, 2021 7:25 PM IST


లేటెస్ట్ గా వచ్చిన టీజర్ గ్లింప్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషన్ నే నమోదు చేసారని చెప్పాలి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న “హరి హర వీరమల్లు” ప్రాజెక్ట్ వీరి కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ ది గా నిలిచింది. దీనితో ఎప్పటి నుంచి ఎంతో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఊహించని రేంజ్ గిఫ్ట్ వచ్చేసరికి ప్రతీ ఒక్కరికీ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా అనిపించింది.

అయితే ఈ గ్లింప్స్ వరకు చూసుకున్నట్టు అయితే విజువల్స్ మరియు యాక్షన్ ఓ రేంజ్ లో ఉండడం ఖాయం అనిపించింది. మరి దీనితో పాటుగా ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ హైలైట్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అని తెలుస్తుంది. వీరమల్లుగా పవన్ చెప్పే కొన్ని పర్టిక్యులర్ పవర్ ఫుల్ డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మరి అందుకు కొంత కాలం ఎదురు చూడక తప్పదు. ఇక ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు