“రాధే శ్యామ్” లో థ్రిల్ చేసే ఈ అంశం.!

Published on Aug 27, 2021 5:05 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే అన్ని రకాల షూట్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాదికి ప్లాన్ చెయ్యగా ఈ చిత్రం మాత్రం ఒక డెఫినెట్ థ్రిల్లర్ గా ట్రీట్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తుంది.

థ్రిల్ చేస్తుంది అని అంటే ఈ చిత్రంలో విజువల్స్ డెఫినెట్ థ్రిల్లింగ్ గా ఉంటాయట. వి ఎఫ్ ఎక్స్ వర్క్ ఈ చిత్రంలో చాలా కేర్ తీసుకొని నాచురల్ గా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు పాటల్లోని విజువల్స్ అయితే ఖచ్చితంగా మరో ప్రపంచానికి తీసుకెళ్లడం ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సరికొత్త టెక్నాలజీని వాడారని తెలిసిందే. దీనితో మేకర్స్ ఎంతో కేర్ గా చేస్తున్న ఈ వర్క్ విజువల్ గా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :