“RRR” కోసం అక్కడ పోటీ పడుతున్న బడా నిర్మాణ సంస్థ.?

“RRR” కోసం అక్కడ పోటీ పడుతున్న బడా నిర్మాణ సంస్థ.?

Published on Feb 6, 2021 8:28 PM IST

rrr release
దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిపి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ పైనే అన్ని సినీ వర్గాల్లో గుట్టుగా టాక్ వినిపిస్తుంది. అన్ని చోట్లా కూడా రికార్డు స్థాయి బిజినెస్ ను జరుపుకుంటుంది అని టాక్ వినిపిస్తున్న ఈ చిత్రం హక్కుల కోసం కోలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ గట్టిగా ట్రై చేస్తుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

వారే “లైకా ప్రొడక్షన్స్”. కోలీవుడ్ లో పలు భారీ బడ్జెట్ సినిమాలను తీసిన వీరు RRR హక్కులను సాధ్యమైనంత వరకు సొంతం చేసుకునే పనిలో ఉన్నారట. రేటు విషయం ఏమో కానీ ఆల్ మోస్ట్ అయితే అక్కడ ఈ చిత్రాన్ని వారే విడుదల చేయనున్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంలో కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సిటైల్ నటుడు సముథ్రఖని ఒక కీ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు